Quantcast
Channel: Indian Food Recipes | Telugu Recipes | Andhra Recipes | Andhra sweets | Telugu Pickles
Viewing all 2280 articles
Browse latest View live

honey cake recipe

$
0
0

హనీ కేక్ రెసిపి

కావలసినవి:

తేనె: పావులీటరు
కోడిగుడ్లు: 3
ఆరెంజ్‌పీల్‌  తురుము : టీస్పూను
ఆరెంజ్‌జ్యూస్‌: పావులీటరు
వెన్న: అరకప్పు
దాల్చినచెక్కపొడి: టీస్పూను
బాదంపొడి: అరకప్పు
 మైదా: పావుకిలో
బేకింగ్‌పౌడర్‌: 3 టీస్పూన్లు
 బేకింగ్‌సోడా: అరటీస్పూను
ఉప్పు: అరటీస్పూను

తయారుచేసే విధానం  
ముందుగా ఓవెన్‌ను  180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడిచేసి ఉంచుకోవాలి.  సుమారు పది అంగుళాల ఎత్తు ఉన్న కేకుటిన్నుకి నెయ్యి రాసి మైదాపిండి చల్లి పక్కన ఉంచాలి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి.  మరో గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే తేనె, వెన్న, ఆరెంజ్‌జ్యూస్‌ వేసి బాగా కలపాలి. తరవాత బాదంపొడి కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేకు టిన్నులో వేసి ఓవెన్‌లో పెట్టి సుమారు 45 నిముషాల పాటు  బేక్‌ చేయాలి. చల్లారిన తరవాత ముక్కలుగా ఆ  ముక్కల  పైన తేనెను వేసి సర్వ్ చేసుకోవాలి.


Banana Muffins Recipe

$
0
0

Banana Muffins Recipe

Ingredients

All-purpose flour -    1 1/2 cups
Baking powder -    1 teaspoon
Baking soda -    1 teaspoon
Salt -1/2 teaspoon
Large bananas, - 3  mashed
White sugar -    3/4 cup
Egg -1
Butter, melted -   1/3 cup

Directions

Preheat oven to 350 degrees F (175 degrees C). Coat muffin pans with non-stick spray, or use paper liners. Sift together the flour, baking powder, baking soda, and salt; set aside.
Combine bananas, sugar, egg, and melted butter in a large bowl. Fold in flour mixture, and mix until smooth. Scoop into muffin pans.
Bake in preheated oven. Bake mini muffins for 10 to 15 minutes, and large muffins for 25 to 30 minutes. Muffins will spring back when lightly tapped.

Deepavali Special Recipes

$
0
0

దీపావళి స్పెషల్  రెసిపీస్

 

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు:--

పాలు -- 1/2 లీటరు
కొబ్బరి తురుము -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్
పంచదార -- 1/4 కేజీ
కిస్ మిస్ -- 2 స్పూన్స్
జీడిపప్పు -- 3స్పూన్స్
బాదంపప్పు -- 2 స్పూన్స్
నెయ్యి -- 2 స్పూన్స్
సగ్గుబియ్యం -- 1/4 కప్పు (10 నిముషాలు ముందు ఉడికించి పక్కన పెట్టుకోవాలి)

తయారీ విధానం:--


ముందుగా  స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ , బాదం పప్పు లను వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి, బాగా మరిగిన తరవాత పంచదార వేసి.... అందులో కొబ్బరి తురుము, ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న సగ్గుబియ్యం, అన్ని వేసి బాగా మరిగించి, దించేముందు యాలకులపొడిని వేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయించి పక్కన ఉంచుకున్న .. జీడిపప్పు, కిస్ మిస్, బాదంపప్పు  వేసుకోవాలి. అంతే తియ్యని కమ్మని కొబ్బరి పాయసం రెడీ.

 పొట్లకాయ తిమ్మనం

కావలసిన పదార్థాలు:--

బియ్యపు పిండి -- 3 స్పూన్స్
పొట్లకాయ ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
కొబ్బరి -- 4 స్పూన్స్
పాలు -- 1/2 లీటరు
పంచదార -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రా
కిస్ మిస్ -- 25 గ్రా
యాలకులపొడి -- 1 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్

తయారీ విధానం:--

ముందుగా  బియ్యంపిండిని, కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించి, పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న కొబ్బరి + బియ్యపుపిండి మిశ్రమాన్ని మరియు ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలని వేసి సన్నటి సెగ మీద 10 నిముషాలు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడే సమయానికి దించెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి... జీడిపప్పు + కిస్ మిస్ లను దోరగా వేయించి తిమ్మనంలో వేసుకుని, యాలకులపొడిని కూడా కలిపుకోవాలి. అంతే తియ్యటి తిమ్మనం రెడీ. ఈ తిమ్మనంలో అట్లను నంజుకొని తింటే చాలా బావుంటుంది.

 

- సీతాదేవి

Depavali Special Sweets

$
0
0

దీపావళి స్పెషల్  స్వీట్స్

 

 

*****

చూర్మా లడ్డు

 

కావలసినవి:

కోవా - 100 గ్రాములు
గోధుమ పిండి - 200 గ్రాములు
బాదాం పప్పు - 50 గ్రాములు
యాలకులు - 4
నెయ్యి - 400 గ్రాములు
పంచదార పొడి - 200 గ్రాములు

తయారీ :

గోధుమ పిండి తీసుకుని  కరిగించిన  నెయ్యి  కొద్దిగా నీళ్లు చపాతీ పిండిలా కలుపుకుని ఆ  పిండిని చిన్న  చిన్న ఉండలుగా  చేసుకుని  స్టవ్ వెలిగించి   పాన్‌ పెట్టి  నెయ్యి వేసి  తడిపిన   ఈ ఉండలను వేసి బ్రౌన్ కలర్ వరకు వేయించుకుని  చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని కోవా వేసి కలపాలి. తరువాత పంచదార, బాదాం  యాలకులు కలిపి పొడి పెట్టుకోవాలి. పాన్‌లో  కొద్దిగా నెయ్యి వేసి  గోధుమపిండి, కోవా మిశ్రమం వేసి  కొంచంసేపు వేయించి,  చల్లారాక.  బాదాం మిస్రమాన్నీ వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.

*****

కర్బూజా రసగుల్ల

కావలసినవి:
కర్బూజా పండు - అరకేజి
పాలు - ఒక లీటర్
నెయ్యి -100 గ్రా
పంచదార - 2 కప్పులు
కార్న్ ఫోర్- 3 స్పూన్లు
నిమ్మకాయ -1
 
తయారు చేసే విధానం:

ముందుగా చక్కెరతో  తీగ పాకం పట్టాలి తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సిలో వేసి  జ్యూస్ చేసుకొని పాకము చల్లారాక  జ్యూస్ ను అందులో కలపాలి. తరువాత   పాలను మరిగించి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి. తరువాత అందులో నీరంతా పోయేలా పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి.ఇప్పుడు విరిగిన పాల మిశ్రమంలో  కార్న్ ఫోర్ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి పోసి కాగాక  ఉండలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ముందుగా తయారుచేసుకున్న కర్బూజా జ్యూస్ లో వేసి నానవ్వాలి.లేదా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు...


*****

పాల పూరీలు

కావలసిన పదార్థాలు :

మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
పాలు - అర లీటరు
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
నూనె- సరిపడా
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు
యాలకుల పొడి - కొద్దిగా

తయారీ విధానం :
ముందుగా పాలు బాగా కాచి అందులో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి వేసి బాగా కలిపి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి.మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన వేసి  కలిపి పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి.  పిండితో పూరీలు చేసి పెట్టుకుని ఆయిల్ మరిగించి పూరీలు బ్రౌన్ గా వేయించి తయారు చేసుకున్న పాల మిశ్రమంలో వేసుకుని అవి నానాక సర్వ్ చేసుకోవాలి.

 

Peanut Butter Cookies recipe

$
0
0

 Peanut Butter Cookies Recipe 

 

Ingredients

Butter - (1/2 cup)
Sugar - 1/2 cup
All Purpose Flour - 1.5 cups
Egg - 1
Vanilla essence - 1/2 tsp
Salt - a pinch
Peanut Butter  - 1 cup
Brown Sugar - 1/2 cup

Preparetion :

 Take the butter, peanut butter, white sugar and brown sugar and mix together for a few  minutes till everything is blended well.
 Add the egg and vanilla essence and mix till you have a creamy mixture.
 Add the all purpose flour and mix. 
 The dough would be very sticky at this stage. Refrigerate it for atleast 1 hour before  making cookies.
 Make small key lime sized dough balls and flatten it slightly.
 Make a crisscross pattern with the back of a fork dipped in sugar.
 Place on an ungreased cookie sheet. Bake in a 375 degree oven for about 10-12  minutes until the cookies become golden brown.
 Remove gently from the cookie sheet and cool completely before serving.

 

Colourful kaju sweet

$
0
0

కలర్ ఫుల్ కాజు స్వీట్

కావలసినవి:

కాజు పేస్ట్ - 200 గ్రాములు
చక్కెర -150 గ్రాములు
బాదం పేస్ట్ - 50 గ్రాములు
డ్రైఫ్రూట్స్, జీడిపప్పు - అర కప్పు
పిస్తా - 10గ్రాములు
కిస్‌మిస్ - 10 గ్రాములు
చక్కెర - 30 గ్రాములు
గ్రీన్ కలర్ - చిటికెడు
గులాబీ రంగు ఫుడ్ కలర్- చిటికెడు

తయారి:
ముందుగా జీడిపప్పు పేస్టులో  పంచదార కలిపి ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత ఒక ట్రేలోకి తీసుకుని, ఫుడ్ కలర్,సన్నగా కట్ చేసిన  డ్రై ఫ్రూట్స్ కలిపి పక్కన ఉంచాలి. బాదం పేస్టులో నాలుగు స్పూన్ ల పంచదార  వేసి ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత రెండు భాగాలు చేసి ఒక భాగంలో గ్రీన్ కలర్ కలపాలి. ఇప్పుడు ముందుగా ట్రేలో గ్రీన్ కలర్ కలిపిన బాదం మిశ్రమాన్ని, ఆ పైన తెల్లగా ఉన్న బాదం మిశ్రమాన్ని సర్దాలి. ఇప్పుడు పింక్ కలర్ కాజు మిశ్రమం బాల్‌ని పెట్టి రోల్ చేసి అన్ని భాగాలను మూసినట్లు చేయాలి. వీటిని కట్ చేసి ముక్కలుగా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ ఫుల్ కాజు స్వీట్ రెడీ
...

 

Childrens day Special

$
0
0

చాకోలెట్ తో గులాబ్ జామున్

 



కావలసినవి :

గులాబ్ జామ్ పౌడర్  - 1కప్పు
డైరీ మిల్క్ చాకోలెట్ - 1
పాలు - ఒక కప్
పంచదారా -  ఒకటిన్నర కప్పు
డాల్డా - సరిపడా

 తయారీ :

ముందుగా చాకొలేట్ ని కొన్ని నీళ్ళు తీసుకుని కలిపి పేస్ట్  లా చేసుకొని అందులో గులాబ్ జామున్ పొడి వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు కొద్దిగా పాలు కూడా వేసుకుని పిండి  కలుపుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో  రెండు గ్లాస్ ల నీళ్ళు, పంచదార   కలిసే వరకు గరిటతో తిప్పి తీగ పాకం వచ్చే వరకు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపి ఉంచుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డాల్డా వేసి కరిగి వేడయ్యాక చేసి పెట్టుకున్న ఉండలను ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వాటిని పంచదారా పాకంలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ వెరైటీ  చాకొలేట్ గులాబ్ జామున్ రెడీ  
 

 

*******

 

చాకొలెట్ బాదాం హల్వా

 



కావలసిన పదార్థాలు:

పాలు-అర లీటరు
కోకో పౌడర్- అర కప్పు
పంచదార - 250 గ్రాములు
బ్రెడ్ స్లైసులు -2
జీడిపప్పు పొడి- రెండు స్పూన్లు
 కిస్‌మిస్ - కొన్ని
నెయ్యి - రెండు స్పూన్స్
బాదంపప్పు- 50గ్రాములు

తయారీ:

ముందుగా  పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించి పెట్టుకోవాలి. తరువాత  పాలలో బ్రెడ్ స్లైస్ లు , కోకో పౌడర్ , పంచదార, బాదాం నానపెట్టి పొట్టు తీసుకుని  చేసుకున్న
పేస్ట్, కొద్దిగా జీడిపప్పు పొడి వేసి కలిపి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం గట్టిగా హల్వాలా అయిన తరువాత చివరిలో నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు  ప్లేటకి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకుని హల్వాను ప్లేట్ లో వేసుకుని ముక్కలుగా కట్ చేసి దానిపై కిస్మిస్, జీడిపప్పు,బాదాం పలుకులు వేసి డెకరేట్ చేసుకోవాలి. 
 

Paneer Rasgulla

$
0
0

పన్నీర్ రసగుల్లా 

కావలసిన పదార్థాలు .

పనీర్‌ - అర కేజీ.
కండెన్స్‌డ్‌ మిల్క్‌ - పావు లీటర్‌
పంచదార - పావు కేజీ
మైదా - అర కప్పు
ఇలాచి పౌడర్  - 1/2 టీస్పూన్‌
కుంకుమ పువ్వు - కొద్దిగా

తయారు చేసే విధానం :

ముందుగా  స్టవ్‌ వెలిగించి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, పంచదార వేసి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతుండాలి. పనీర్‌, మైదా పిండి కలిపి ఉండలుగా చేసుకో వాలి. ఇప్పుడు ఈ ఉండలను పాకంలో వేసి 10 నిమిషాల వరకు ఉడకనిచ్చి దింపెయాలి. చల్లారిన తరువాత ఉండలను బయటకు తీయాలి. కండెన్స్‌డ్‌ మిల్క్‌లో కుంకుమపువ్వు, యాలకుల పొడివేసి కలిపి అందులో ఈ ఉండలను వేయాలి అంతే నోరూరించే  పన్నీర్ రసగుల్లా  రెడీ ...


Bandar Halwa

$
0
0

బందర్ హల్వా

 

కావలసిన వస్తువులు:

గోధుమపిండి       -    అర కిలో.
జీడిపప్పు             -     50 గ్రాములు
బెల్లం                  -     అర కిలో
నెయ్యి                -     పావు కిలో
యాలుకల పొడి    -     రెండు స్పూన్లు
రెడ్ కలర్             -     చిటికెడు.

తయారు చేసే విధానం:

ముందుగా గోధుమపిండిని  నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో ఉంచి ఆ ముద్ద మునిగేలా నీళ్ళు పోసి  నానబెట్టాలి. తర్వాత  ఆ నీళ్ళలో గోధుమపిండి ముద్దను బాగా కలిపి, వచ్చే గోధుమ పాలను వడగట్టి వుంచుకోవాలి. వడగట్టి వుంచిన గోధుమ పాలలో పైకి తేరుకున్న నీళ్ళు కొన్ని తీసేసి దానిలో రెడ్‌కలర్  కలపాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించుకుని గిన్నెపెట్టుకుని  బెల్లం , సరిపడ  నీళ్ళు పోసి ముదురుపాకం వచ్చాక గోధుమపాలు కలపాలి. జీడిపప్పు వేసి చిన్న మంటపెట్టి ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత ఇందులో నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ వుండాలి. మిశ్రమాన్ని గట్టిపడిన తరువాత చివరిలో  ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ట్రే కి నెయ్యి రాసి అందులో హల్వా వేసి చల్లారాక కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.బందర్ హల్వా రెడీ...

Karachi Halwa Recipe

$
0
0

కరాచి హల్వా  రెసిపి

 

కావలసిన పదార్థాలు :

కార్న్ ఫ్లోర్ - 100 గ్రాములు
నెయ్యి -  75 గ్రాములు
 పంచదార - 250 గ్రాములు
రెడ్ కలర్ - చిటికెడు
యాలకుల పొడి -అర స్పూన్
బాదాం,  జీడిపప్పు - పావు కప్పు ( అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి)

తయారీ :

ముందుగా ఒక గిన్నె తీసుకుని  సరిపడా  నీళ్ళు పోసి  పంచదార వేసి బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్  చేయాలి. ఇప్పుడు  గిన్నె లోకార్న్ ఫ్లోర్  కొద్దిగా నీళ్ళు వేసి జారుగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టి  నెయ్యి వేసి కరిగిన తరువాత కలిపి వుంచుకున్న  పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రం దగ్గర పడ్డాక అందులో పాకం  కొద్ది కొద్ది గా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించి స్పూన్ నెయ్యిలో రెడ్ కలర్ కలిపి హల్వాలో  వెయ్యాలి. ఇప్పుడు ఇలాచి, జీడిపప్పు  వేసి కలిపి చివరిలో నెయ్యి వేసుకోవాలి ఒక ఐదు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్ లో హల్వా వేసి చల్లారక ముక్కలుగా  కట్ చేసుకోవాలి.

Malpuri Sweet

$
0
0

మాల్ పూరీ స్వీట్

 

కావలసిన వస్తువులు:

బొంబాయి రవ్వ - 200 గ్రాములు
బేకింగ్ పౌడర్ - అర స్పూను
ఉప్పు - అర స్పూను
చక్కెర - 500గ్రా.
కుంకుమపువ్వు - అర స్పూన్
జీడిపప్పు - అర కప్పు
మైదాపిండి - 50 గ్రాములు
పాలు - అర లీటర్
యాలకులు - 4
నెయ్యి - 100 గ్రాములు

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెతీసుకుని అందులో బొంబాయి రవ్వ, మైదాపిండిని తీసుకుని దానిలో ఉప్పు, పాలు వేసి కలిపి పల్చనీ  పిండిలా తయారుచేసి మూతపెట్టి మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి. తరువాత   స్టవ్ వెలిగించి   పాన్ పెట్టుకుని  నానపెట్టుకున్న పిండిని  కొంచం  మందంగా దోసలా  పోసి రెండువైపులా నేతితో  కాల్చాలి. ఇప్పుడు   ఒక గిన్నెలో  సరిపడా  నీళ్ళు పోసి ,చక్కెర వేసి స్టవ్ పై పెట్టి లేతపాకం వచ్చాకా అందులో కుంకుమపువ్వు, ఇలాచి పొడి, సన్నగా  కట్ చేసుకున్న  జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దోసలా  వేసుకున్న మాల్‌ పూరీలను పాకంలో వేసి 10 నిమిషాలు నానబెట్టి వెంటనే సర్వ్ చేసుకోవాలి .

Sorakaya Kheer

$
0
0

 సొరకాయ ఖీర్

 

 

కావలసినవి:

సొరకాయ : ఒకటి
మిల్క్‌మెయిడ్ : 400 గ్రాములు
బాదం,ఎండుద్రాక్ష,జీడిపప్పు : అర కప్పు
గ్రీన్ ఫుడ్‌ కలర్ : చిటికెడు   
పాలు :  లీటర్
నెయ్యి.. 500 గ్రాములు
బాస్మతి రైస్ :  100 గ్రాములు .
కార్న్‌ఫ్లోర్ : 100 గ్రాములు .
కోవా : పావు కేజీ
పంచదార : అర కేజీ

తయారు చేయు విధానం:

ముందుగా సొరకాయ తురుము తీసుకుని  కాస్త ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత  బాస్మతి బియ్యాన్ని నెయ్యి వేసి  వేయించి  పిండి చేసుకుని పెట్టుకోవాలి . తరువాత  గిన్నెలో పాలు పోసి మరిగించాలి, ఇప్పుడు  బియ్యంపిండిలో  కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టులా చేసి  మరుగుతున్న పాలల్లో  వేసి కలపాలి.  అలాగే కార్న్ ఫ్లోర్  కూడా పేస్టులా చేసి అందులో వేసుకోవాలి.ఇప్పుడు ఉడికించుకున్న సొరకాయ తురుము కూడా వేసుకోవాలి.ఒక ఐదు నిముషాలు ఆగి  పంచదార వేసి కరిగే వరకు కలపాలి.  పది నిముషాల తరువాత  కోవా , మిల్క్‌మెయిడ్, కలర్ ఒక్కొక్కటిగా వేసి బాగా  కలపాలి. ఖీర్ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమం బౌల్ లోకి తీసుకుని  వేయించిన  బాదం, ఎండుద్రాక్ష,జీడిపప్పలతో డెకరేట్ చేసుకుని గంటసేపు ఫ్రిజ్  లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవాలి.

Christmas Special

$
0
0

 

 

క్రిస్ట్‌మస్‌  స్పెషల్

  

 

 

చాక్లెట్ కేక్


కావలసిన పదార్ధాలు:

మైదాపిండి - 250 గ్రాములు
కొకో పౌడర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు
వెన్న - 250 గ్రాములు
చక్కెర - పావు కేజీ
గుడ్లు -  4
పెరుగు - 1 కప్పు
వెనిల్లా ఎస్సెన్స్‌: 1 టీ స్పూన్‌
బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు
సాల్ట్‌ -  చిటికెడు

తయారు చేసే విధానం:

ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయండి. తరువాత  ఒక టిన్‌ తీసుకొని దాని చుట్టూ నెయ్యి రాయ్యాలి. ఇప్పుడు మైదాలో బేకింగ్‌ పౌడర్‌, సాల్ట్, కొకో పౌడర్‌ వేసి బాగా కలపాలి. వెన్నలో ఉండలు లేకుండా  చేసుకొని అందులో  చక్కెర పొడి కలిపి ఎగ్‌ బీటర్‌తో   బీట్‌ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. ఇప్పుడు కొకో పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత  మైదా పిండిని మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా  పెరుగును కూడా వేస్తు పేస్ట్ లా చేసుకోవాలి. చివరిలో వెనిలా  ఎస్సెన్స్‌ కలుపుకొని కేక్‌ టిన్‌లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఒవెన్‌ ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో  వుంచి 40 నిముషాలు బేక్ చెయ్యాలి.

 

 

డ్రైఫ్రూట్స్‌ కేక్‌

 



కావల్సినవి:
మైదా - 200 గ్రాములు
డ్రైఫ్రూట్స్‌ - ఒక కప్పు
పాలు - అర కప్పు
ఆరెంజ్ జ్యూస్ - ఒక కప్పు
వెన్న - 150 గ్రాములు
యాలకులపొడి - అరచెంచా,
బేకింగ్‌ పొడి - ఒకటిన్నర స్పూన్
పంచదార - 150 గ్రాములు
మిల్క్‌మెయిడ్‌ - యాభై గ్రాములు
మిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు - కొద్దిగా

తయారీ :

ముందుగా పాత్రలో వెన్న, పంచదార, మిల్క్‌మెయిడ్‌, పాలు, యాలకులపొడి తీసుకుని బాగా కలపాలి. తరువాత  డ్రైఫ్రూట్స్‌ ఆరెంజ్ జ్యూస్ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు  మైదా వేసి బాగా కలిపి చివరిలోమిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు వేసుకుని మరోసారి కలపాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడిచేసి పెట్టుకోవాలి. తరువాత కేక్‌ టిన్ కి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకుని 35 నిముషాల పాటు  బేక్‌ చేయ్యాలి.

 

ఫ్రూట్ కేక్

 



కావలసిన పదార్థాలు:
 గుడ్లు - నాలుగు
 మైదా - రెండు కప్పులు
 పంచదార - 120 గ్రాములు,
మిక్స్‌డ్ ఫ్రూట్ ఎసెన్స్ - అర స్పూన్
పెరుగు - రెండు కప్పులు
టూటి ఫ్రూటీలు - ఒక కప్పు
లెమన్ ఎల్లో కలర్ - నాలుగు చుక్కలు.

తయారుచేయు విధానం:

ముందుగా గుడ్డులో తెల్లసొనని వేరు చేసి బాగా గిలకొట్టాలి.  అందులో పంచదార పొడి వేసి మళ్లీ గిలకొట్టాలి. తరువాత పచ్చసొన కూడా వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో మైదా, ఎసెన్స్, లెమన్ ఎల్లో కలర్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. దీన్ని ఓవెన్‌లో 180 డిగ్రీల  వద్ద 30 నిమిషాలపాటు బేక్ చేయాలి. తరువాత టూటి ఫ్రూటీలతో కేక్‌ని డెకరేట్ చేసుకోవాలి.




Gasagasala Payasam/Poppy seeds payasam

$
0
0
  1. Dry roast poppy seeds and rice until they turn crisp and lightly change color.
  2. Finely powder the roasted poppy seeds and rice in a blender without adding any water.
  3. Add grated coconut, desiccated coconut, some water and grind to a smooth paste.
  4. Add half a cup of water and strain the paste through a finely perforated strainer; Retain the liquid - this will make the payasam later.
  5. Transfer the coarse residue into a blender; Add some more water and grind again to a smooth paste.
  6. Repeat steps 4 and 5 about 3-4 times.
  7. Add jaggery to the strained liquid and boil on low-medium heat until all the jaggery dissolves; Remove from stove.
  8. Dissolve saffron strands in 1/4 cup of warn milk and set aside for 5-10 mins.
  9. Add powdered elaichi,warm milk with saffron and mix well; Serve hot and relish.

Rava Rasgullalu

$
0
0
  1. Clean semolina.
  2. Add salt, ghee and blend in a mixie.
  3. Make small balls, flatten.
  4. Place paalkhoa in the centre and close.
  5. Heat ghee in a frying pan.
  6. Fry these balls.
  7. Boil sugar with water in a vessel to a syrup of single string consistency.
  8. Soak the rasagullas in syrup.
  9. Dalda can also be used instead of ghee.  

Chocolate Burfi

$
0
0

 చాక్లెట్ బర్ఫీ

 

కావలసిన పదార్ధాలు:

చాక్లెట్  పౌడర్ – అర కప్పు
మైదా – అర కప్పు
నెయ్యి – ఒక కప్పు
పాలు – పావు లీటర్
జీడిపప్పు – అర కప్పు
పంచదార – 300 గ్రాములు

తయారు చేసే విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక మైదా పిండి  వేసి వేయించాలి. తరువాత మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీరు పోసి అందులో పంచదార వేసి పాకం పట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో పాలు పోసి అందులో చాక్లెట్ పౌడర్ వేసి చిన్నమంట మీద మరిగించాలి అందులో  ముందు వేయించి పెట్టుకొన్న మైదా, సరిపడా నీళ్లు వేసి  చిక్కబడే వరకూ కలియ బెడుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్క బడ్డాక పంచదార పాకంను, జీడిపప్పును వేసి కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చిక్కబడ్డాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో చాక్లెట్ మిక్స్ అందులో పోసి పైన  చాక్లెట్  పౌడర్ ను చల్లి చల్లారాకా  కావలసిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.

New year special

$
0
0

న్యూఇయర్ స్పెషల్

 

 

యాపిల్‌ కేక్‌

కావలసినవి :

యాపిల్స్‌-మూడు,
బటర్‌కాగితం-ఒకటి
మైదా-రెండు కప్పులు
క్యాస్టర్‌ షుగర్‌-250 గ్రాములు
వెన్న- 100 గ్రాములు
గుడ్లు-రెండు
దాల్చిన చెక్కపొడి-రెండు స్పూన్లు
పాలు -అర లీటర్
బేకింగ్‌ పౌడర్ - ఒక స్పూన్
వంట సొడా - ఒక స్పూన్
గరంమసాలా- అర స్పూన్

తయారుచేసే విధానం :

ఓవెన్‌ను ముందుగా175 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌ ఉంచే పాత్రకు బటర్‌ కాగితాన్ని రాయాలి. మైదా, బేకింగ్‌పొడి, వంటసోడా, గరంమసాలా దాల్చిన చెక్కపొడులను విడివిడిగా జల్లించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో క్యాస్టర్‌ షుగర్‌ వెన్న తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్ల సొన చేర్చి ఆ తరువాత ముందుగా జల్లించిన పొడులు, సన్నగా తరిగిన యాపిల్‌ ముక్కల్ని కలపాలి. చివరగా పాలు చేర్చి కేక్‌ పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ట్రేలో నీళ్లు పోసి నలభై నిమిషాల పాటు బేక్‌ చేయాలి. అంతే యాపిల్‌ కేక్‌ రెడీ

 

*******

పైనాపిల్ కేక్



కావలసిన పదార్థాలు :

పైనాపిల్ ముక్కలు - రెండు కప్పులు
ఆరెంజ్ తొక్కల రసం - 1 స్పూన్
బేకింగ్ సోడా    -  1 స్పూన్
తేనె             -    ముప్పావు కప్పు
బ్రౌన్ షుగర్   -  పావు కప్పు
మైదా          -  రెండు కప్పులు             
బేకింగ్ పౌడర్  -   1 స్పూన్
చీజ్             -   150 గ్రాములు
నిమ్మరసం     -   2 టేబుల్ స్పూన్లు

తయారుచేసే పద్ధతి :

 ముందుగా కొన్ని పైనాపిల్ ముక్కలు ఉంచి మిగిలిన ముక్కలను జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. మరో గిన్నెలో నెయ్యి, తేనె, చీజ్, పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం, ఆరెంజ్ తొక్కల తురుము వేసి గిలక్కొట్టాలి. ఈ గుడ్డు మిశ్రమం మొత్తాన్ని మైదా మిశ్రమం లో కలపాలి. కేక్ బాక్స్ లో అడుగున పైనాపిల్ ముక్కలు పేర్చాలి. దానిమీద జాగ్రత్తగా కేక్ మిశ్రమాన్ని వేయాలి. ఈ పాత్రని ఓవెన్ లో అరగంట బేక్ చేయాలి. కేక్ బ్రౌన్ కలర్ లో కి రాగానే ఓవెన్ లో నుండి బయటకి తీసేయ్యాలి. చల్లారిన తర్వాత కేక్ బాక్సును ప్లేటు మీద బోర్లించి ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.

Moong dal halwa

$
0
0

మూంగ్ దాల్ హల్వా

కావలసినవి :
పెసరపప్పు : 100  గ్రాములు
పాలు : పావు లీటర్
నెయ్యి : 100  గ్రాములు
యాలకులపొడి : అర టీ స్పూన్
బాదం పప్పులు : మూడు
జీడిపప్పులు : ఆరు
కిస్మిస్లు : ఆరు మిల్క్
కండెన్స్డ్ మిల్కు : కప్పు

తయారుచేయు విధానం :

ముందుగా పెసరపప్పుకడిగి  రెండు గంటల ముందు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి .తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి  నెయ్యి వేసి కాగాక, గ్రైండ్ చేసిన పెసరపప్పుపేస్ట్ ను వేసి  కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పాలు పోసి  ఉడికించాలి.  పాలు ఇగిరిపోయాక కండెన్స్డ్డుడు మిల్క్ వేసి కలుపుతూ వుండాలి. కొద్దిసేపటికి  హల్వలా తయారవుతుంది. ఇప్పుడు యాలకులపొడి, జీడిపప్పులు, బాదాం పప్పులు, కిస్మిస్లు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ కూ నెయ్యి రాసి హల్వా వేసి చల్లారక కావలసిన సైజు లో ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి

Badam Basundi

$
0
0

 బాదాం బాసుంది

కావలసినవి
బాదాం - ఒక కప్పు
పాలు - అరలిటర్
కోవా - 50 గ్రామ్స్
 పంచదార 150 గ్రాములు
ఇలాచి పౌడర్ - ఒక స్పూన్

తయారుచేయువిధానం :

ముందుగా బాదంను రాత్రి నీళ్ళల్లో నానా పెట్టాలి. నానిన బాదంను తొక్క తీసి గ్రైండ్ చేసి బాగా పేస్ట్  చేసుకోవాలి . ఇప్పుడు పాలు బాగా మరిగించి  అందులో బాదాం పేస్ట్ వేసి కలపాలి .తరువాత కోవా,పంచదార ఇలాచి పౌడర్ కూడా వేసి కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్  చేసి బౌల్ లో కి తీసుకుని ఫ్రిజ్ లో  రెండుగంటలు  ఉంచి సర్వ్ చేసుకోవాలి..

 

Sankranthi Special

$
0
0

సంక్రాంతి స్పెషల్

 

 

 

మినప సున్నుండలు

 



కావలసినవి :

మినపగుండ్లు : ఒక కేజి.
నెయ్యి : తగినంత
యాలకుల పొడి : కొద్దిగా
పంచదార : ముప్పావు కేజీ

తయారుచేయు విధానం:

ముందుగా మినపగుళ్ళు ను  కొద్దిగా వేయించుకుని చల్లారక మెత్తగా పౌడర్ చేసుకోవాలి.  తరువాత  పంచదార కూడా  పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండి, పంచదార పౌడర్ కలిపి ఉంచుకోవాలి. తరువాత నెయ్యి ని కరిగించి కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అంతే మినప సున్నుండలు రెడీ 

*****


కోవా కజ్జికాయలు

 


కావలసినవి:

మైదా : అరకేజీ
కోవా : రెండు కప్పులు
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
కొబ్బరి తురుము : కప్పు
పంచదార పొడి : నాలుగు కప్పులు
యాలుకల పొడి : టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ ( చిన్నగా కట్ చేసుకోవాలి )  - ఒక కప్పు

తయారుచేయు విధానం :

ముందుగా మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి, ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోవా వేసి స్టవ్ మీద పెట్టాలి. కాసేపటికి కలర్ మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపి, గిన్నెను దించి చల్లారిన తరువాత, దీనిలో కప్పు పంచదారపొడి, యాలుకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు కొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు కలిపిన మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతిలా చేసి, మద్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, చపాతి మడిచి, కజ్జికయలా  ఒత్తాలి. ఇలా అన్నీ చేసుకున్నాక, స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసి, బాగా వేగనివ్వాలి. పక్క స్టవ్ మీద వేరే గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళుపోసి లేత పాకం పట్టాలి. ఇప్పుడు వేగిన కజ్జికాయలు తీసిన వెంటనే పాకంలో వేసి కాసేపువుంచి, పాకంలో నుండి తీసి చల్లారనివ్వాలి.

*****


నేతి అరిసెలు

 



కావలసినవి :

బియ్యం - 2 కేజీ
బెల్లం - 1 కేజీ
నెయ్యి - 200 గ్రాములు
నువ్వులు - కొంచం

తయారు చేసే విధానము :

ముందుగా బియ్యం  ఒక్క రోజు ముందు రాత్రే నానా పెట్టుకోవాలి , దాన్ని ఉదయానే పొడి చేసి జలించు కొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ గిన్నెపెట్టి  అందులో బెల్లం వేసి సరిపడా  నీళ్ళు పోసి పాకం పెట్టాలి, ఇంకో స్టవ్  మీద మూకుడు  పెట్టి నెయ్యి వేసి తెల్ల నువ్వులను దోరగా వేయించాలి . పాకం నీ వడ కట్టుకోవాలి. పాకం లో వేయించిన నువ్వులు బియ్యం బిండి వేసి బాగా కలపాలి . తరువాత ఇంకో పొయ్యి మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి అందులో బియ్యం మిశ్రామని చిన్న ఉండలుగా చేసి వాటిలిని ఒత్తి నెయ్యి లో గోధుమ రంగు వరకు వేగనివాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నేతి అరిసెలు తినడానికి రెడీ !

 

*****


 జంతికలు

 



కావలసిన వస్తువులు :

బియ్యం-1 కేజీ
శెనగపప్పు- అర కేజీ
మినపప్పు -అర కేజీ 
సగ్గుబియ్యం - పావుకేజీ
నూనె - సరిపడినంత
 ఉప్పు,కారం-తగినంత

తయారు చేయు పద్ధతి :

ముందుగా బియ్యం పప్పులు కలిపి మర పట్టించాలి. పిండిలో ఉప్పు, కారం,కొంచెం తెల్ల నూపప్పు, నీళ్ళు కలిపి జంతికల పిండిలాగ కలిపి కొంచెం పిండి జంతికల గొట్టంలో వేసి కాగిన నూనెలో జంతికలు వేయాలి. బాగా వేగాక  బయటకు తీసి,చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకోవాలి.


Viewing all 2280 articles
Browse latest View live


Latest Images